లోటస్ అడ్వాన్స్ స్కూల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
మనోరంజని ప్రతినిధి – సారంగాపూర్, సెప్టెంబర్ 20
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామంలోని లోటస్ అడ్వాన్స్ స్కూల్ లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అలరారుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. తంగేడు పువ్వులతో సహా పలు రకాల పుష్పాలను సేకరించి క్రమపద్ధతిలో పేర్చి బతుకమ్మను సిద్ధం చేశారు. అనంతరం బతుకమ్మను పూజించి, శుభాకాంక్షలు కోరుకున్నారు. వేడుకల సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశార. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.