రోడ్డుపై గుంతలు… స్వయంగా పూడ్చిన ట్రాఫిక్ ఎస్ఐ
మనోరంజని తెలుగు టైమ్స్ – నిజామాబాద్ నవంబర్ 28
నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి గేటు వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ, నగరపాలక శాఖ చర్యలు తీసుకోకపోవడంతో ఆ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ పి. కోటేశ్వరరావు ముందుకు వచ్చారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని స్వంత ఖర్చుతో మొరంమట్టి తెప్పించి గుంతలను పూడ్చే కార్యక్రమానికి ఎస్ఐ కోటేశ్వరరావు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది శ్రీనివాస్, పవన్‌కుమార్ తదితరులు సహకరించారు. రోడ్డుపై ప్రమాదాలు తగ్గించాలని నడిరోడ్డుపైనే పనిచేసి, ప్రజల కోసం స్వచ్ఛందంగా ముందడుగు వేసిన ఎస్ఐ కోటేశ్వరరావు చర్యను స్థానికులు అభినందించారు. అధికార యంత్రాంగం స్పందించని పరిస్థితుల్లో పోలీసులు స్వయంగా ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు.