ఏపీలో పేద రోగుల అవస్థలు…

ఏపీలో పేద రోగుల అవస్థలు…

ఏపీలో పేద రోగుల అవస్థలు… మూడు రోజులుగా నిలిచిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు

 

  • రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు

  • ప్రభుత్వానికి ఆసుపత్రుల బకాయిలు క్లియర్ చేయకపోవడమే కారణం

  • ట్రస్టు ఆసుపత్రులకే క్యూ కడుతున్న రోగులు

  • ప్యాకేజీ రేట్లు పెంచాలని ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్

 

ఆంధ్రప్రదేశ్‌లో పేదల ప్రాణాధారంగా ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు మూడు రోజులుగా నిలిచిపోయాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేశాయి. ఫలితంగా అత్యవసర వైద్య సేవలు కూడా దెబ్బతిన్నాయి. గత్యంతరం లేక ట్రస్టు ఆసుపత్రుల వద్ద రోగులు క్యూ కడుతున్నారు. ప్యాకేజీ రేట్లు పెంచాలని ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు అందిస్తున్న వైద్య సేవలు నిలిచిపోవడం కలకలం రేపింది. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ చేయకపోవడంతో గత మూడు రోజులుగా అనేక ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేశాయి.

ఈ కారణంగా శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సలు మరియు ఇతర ముఖ్యమైన వైద్య సేవలు నిలిచిపోయాయి. గత్యంతరం లేక ట్రస్టు ఆసుపత్రులు, ప్రభుత్వ దవాఖానలకే ప్రజలు క్యూ కడుతున్నారు.

ఇక మరోవైపు ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది. ముఖ్యంగా, వైద్య సేవల ప్యాకేజీ రేట్లు పెంచాలని, బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, పథకంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.

వైద్య రంగ నిపుణులు ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాబోయే రోజుల్లో పేద రోగులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment