చిన్న ఆత్మకూర్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

చిన్న ఆత్మకూర్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఓటు హక్కును వినియోగించుకున్న మనోహర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):

రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని నూతనంగా ఏర్పాటైన చిన్న ఆత్మకూర్ గ్రామ పంచాయతీలో పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డుకు చెందిన పోలింగ్ బూత్‌లో మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి తొలుత ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ఎన్నికల ద్వారా సరైన ప్రతినిధులను ఎన్నుకుంటేనే పల్లెల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టగా, ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment