మిర్యాలగూడ, జూలై 8
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని తన నివాసం వద్ద వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని తన నివాసం వద్ద వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్తు, ఆరోగ్య సేవలు వంటివి అందించారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల బక్కారెడ్డి, దామరచర్ల మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ లక్ష్మణ్ గౌడ్, జవహర్ నాయక్, ఉబ్బేపల్లి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.











