కార్యక్రమం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.
వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమంలో తోలేటి శ్రీకాంత్
విజయవాడ, సెప్టెంబరు 2 (మనోరంజని తెలుగు టైమ్స్): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజలకు అందించిన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.
కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం అధ్యక్షులు జవ్వాది సుధీర్, బీసీ నాయకులు జామి కేశవ్, చింతలూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.












