హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఏప్రిల్ 18వ తేదీన యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా ధర్నాకు మద్దతుగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఇంచార్జి కొర్ర రామ్ సింగ్ నాయక్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పోస్టర్ను ఆవిష్కరించారు.
మిర్యాలగూడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు, శ్రేణులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మద్దతుతో, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధ బాలకృష్ణ సమక్షంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రూపావత్ హరిప్రసాద్ మాట్లాడుతూ, మిర్యాలగూడ నియోజకవర్గ యువత అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు, పట్టణ యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.












