మిర్యాలగూడ, జూన్ 27
స్పెషల్ ఇంటెన్సివ్ రేవిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న ఫారాలను జాగ్రత్తగా నింపాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి కోరారు. శనివారం 5వ వార్డులో ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటరు ఫోటోతో ఎన్నికల సంఘం ఫారం జారీ చేసిందని, ఫారంలో తప్పులు, దిద్దుబాట్లు ఉండకూడదని అన్నారు. ఫారం ఒక్కసారి మాత్రమే ఇస్తారని, మళ్లీ ఇవ్వరని, అందుకే జాగ్రత్తగా నింపాలని సూచించారు.
కార్యక్రమంలో 5వ వార్డు ఇన్చార్జి కేతావత్ జవహర్ నాయక్, బూత్ లెవెల్ ఆఫీసర్ బొందు పార్వతి, బిఎల్ఎలు అశోక్, వేణు, మధు పాల్గొని ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారంలను అందజేశారు.