తానూరు (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 06
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు మండలం లోని ఝరి బి గ్రామం రోడ్డు సమస్య, ఇతర గ్రామాలకు సంబంధించిన రోడ్ల సమస్యలను ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి వివరించారు. భోల్సా నుండి ఝరి బి గ్రామానికి వెళ్లే లో లెవల్ వంతెన రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి, గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి మండలం లోని ఝరి బి గ్రామం రోడ్డు సమస్య, వివిధ గ్రామాల రోడ్ల సమస్యలను ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి వివరించారు. భోల్సా నుండి ఝరి బి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న లో లెవల్ వంతెన రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయిందని ఆయన తెలిపారు. వంతెన కూలిపోవడంతో ఆ రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు, ఆటోలు, సైకిల్ మోటార్లు, అంబులెన్సులు సైతం ఆ మార్గంలో ప్రయాణించలేకపోతున్నాయి. దీంతో అంబులెన్సులు గ్రామానికి చేరుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ఎస్టిమేట్ కూడా వేయించారని ఆయన పేర్కొన్నారు.
ఈ రోడ్డులోని వంతెనను త్వరగా హై లెవెల్ బ్రిడ్జిగా నిర్మించి, రోడ్డును పునరుద్ధరించి, ఝరి బి, భోల్సా, వాడఝరి, ఝరి బి తండా అనే నాలుగు గ్రామాల ప్రజలకు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు, మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి ఈరోజు మంత్రి జూపల్లి కృష్ణారావుకు విన్నవించారు. అలాగే, కుబీర్ మండలం లోని శివుని నుండి శివుని తండా 2 వరకు రోడ్డు నిర్మాణం, నుండి మొగిలి గ్రామానికి రోడ్డు పనులకు ఇప్పటికే టెండర్లు జరిగి, శంకుస్థాపన కూడా పూర్తయిందని, పనులు త్వరగా ప్రారంభించాలని వారు కోరారు.












