బాసర, 6 September
హైదరాబాదులోని ఇందిరా పార్కులో శనివారం చేపట్టిన బీజేపీ మహా దీక్షలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొన్నారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి బాధితులను తొలగించి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
*బిజెపి మహా దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తో కలసి పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్, ఇతర మండల బీజేపీ నాయకులు. నిర్మల్ జిల్లా మనో రంజని తెలుగు టైమ్స్ 22ఏ నిషేధిత జాబితా నుంచి బాధితులను తొలగించాలని హైదరాబాదులోని ఇందిరా పార్కులో చేపట్టిన బిజెపి మహాదీక్షలో శనివారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులను తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధరణితో గత ప్రభుత్వ హయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే భూభారతితో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, భూ సమస్యల వల్ల రైతులు, భూములు కొన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురించిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు.












