కార్యాలయం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
తానూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మాధవరావు పాటిల్, మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన లోఖండే నాగోరావు జ్ఞానోబాలను ముధోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భోస్లే నారాయణరావు పాటిల్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం బుధవారం భైంసాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది.
నూతన బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులకు సన్మానం
భైంసా, సెప్టెంబరు 2 మనోరంజని తెలుగు టైమ్స్ :తానూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మాధవరావు పాటిల్, మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన లోఖండే నాగోరావు జ్ఞానోబాలను ముధోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భోస్లే నారాయణరావు పాటిల్ ఘనంగా సన్మానించారు. బుధవారం భైంసాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వేడ్మా భోజు పటేల్, ముధోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భోస్లే నారాయణరావు పాటిల్‌లకు మాధవరావు పాటిల్, లోఖండే నాగోరావు జ్ఞానోబా కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ చంద్రా, శెట్టి పాటిల్, షేక్ బషీర్, షేక్ సాజిద్, విఠల్ అంబేకర్, కాంతారావు పాటిల్, మారుతి పాటిల్, మాధవరావు పాటిల్, షేక్ అబ్దుల్ వాహెద్, షేక్ నాయుమ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












