ఖానాపూర్, 2 September
టటసఅధత,సటఅభ,తహచ.సభభతఆసత,బెీచశ.
ఖానాపూర్, సెప్టెంబర్ 2: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు, ఖానాపూర్ యువత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి సేవా కార్యక్రమం చేపట్టారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖానాపూర్కు చెందిన పలువురు యువత, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూ, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం “జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య” అంటూ నినాదాలు చేశారు.

