అనంతసాగరం, 2026-06-05
తాంసి మండల కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం పట్టణ కేంద్రంలో శుక్రవారం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు.
తాంసి మండల కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం పట్టణ కేంద్రంలో శుక్రవారం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మండల కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
కమిటీల ఏర్పాటుపై సూచనలు
నూతన మండల కమిటీల నియామకంలో వర్గ విభేదాలకు తావులేకుండా అందరినీ కలుపుకొని, సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆడే గజేందర్ సూచించారు. ప్రతి మండల కమిటీలో అధ్యక్షుడితో కలిపి మొత్తం 21 మంది సభ్యులు ఉండేలా, అందులో ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉండే విధంగా కమిటీలను రూపొందించాలని తెలిపారు. మహిళా నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆయన సూచించారు.
పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు
సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల అనుభవాన్ని వినియోగించుకునేందుకు ప్రతి మండలంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ () ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా మండల కమిటీల ఏర్పాటును ఆగస్టు 15లోగా పూర్తి చేసి, గ్రామ మరియు బూత్ స్థాయి కమిటీలను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తను పార్టీ అధిష్ఠానం తప్పకుండా గుర్తించి తగిన గౌరవం కల్పిస్తుందని ఆడే గజేందర్ హామీ ఇచ్చారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు మండల కన్వీనర్ కౌడల సంతోష్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, తాంసి మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, ఇచ్చోడ బ్లాక్ ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ధనుంజయ్, అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు బెజ్జంకి అనిల్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు అరుణ్, ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు గంగారెడ్డి, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు బద్దం పోతరెడ్డి, వడ్డాది సర్పంచ్ గంగాధర్, గొట్టుకూరి సర్పంచ్, లింబుగూడ సర్పంచ్ సాంబు పొన్నారి, అంబుగాం ఉప సర్పంచ్లు రామ్ రెడ్డి, భారత్, నాయకులు గంగన్న, విలాస్, గజనందు, బాపురెడ్డి, వెంకన్న, నాందేవ్, నవీన్, నితిన్, రఘు రెడ్డి, రవి, రజబ్ అల్లి, సద్దాం, మౌలానా తదితరులు పాల్గొన్నారు.












