ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే గొంతుకలను అక్రమ కేసులు, అరెస్టులతో అణిచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం దుండ్రపల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న గోలి సందీప్ రెడ్డిని ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే ఉద్యమకారులను గౌరవించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని రవిశంకర్ అన్నారు.
ప్రభుత్వం ఉద్యమకారులపై అక్రమ కేసులు, అరెస్టులతో ఒత్తిడి తీసుకురావడం సరికాదని, ఇటువంటి విధానాలను విరమించుకోవాలని ఆయన సూచించారు.
ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని, ఉద్యమకారులకు ఎల్లప్పుడూ ప్రజల మద్దతు, ఆశీస్సులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై ఒత్తిడి తేవడం సరైన పద్ధతి కాదని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని రవిశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.












