Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 14
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు బలం. ప్రతి అర్హుడి ఓటు సురక్షితంగా ఉండాలనే సంకల్పంతో ఇందిరమ్మ గ్రామ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సారంగాపూర్ మండల సోషల్ మీడియ కో ఆర్డినేటర్ సాక్ పెళ్ళి సురేందర్ తన గ్రామంలో నిర్వహిస్తున్న SIR సర్వేలో స్వయంగా పాల్గొన్నారు. SIR ఫారమ్‌లను నింపుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు.
ప్రజాస్వామ్యానికి ఓటే బలం, ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనే సంకల్పంతో ఇందిరమ్మ గ్రామ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సారంగాపూర్ మండల సోషల్ మీడియ కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ తన స్వంత గ్రామం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం తాండ్ర. జి గ్రామం లో నిర్వహిస్తున్న SIR సర్వేలో స్వయంగా పాల్గొన్నారు. తన స్వహస్తాలతో SIR ఫారమ్‌లను నింపుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా సాక్ పెళ్ళి సురేందర్ మాట్లాడుతూ, "ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది. ఒక్క అర్హుడి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా, ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షించడం మనందరి బాధ్యత" అని అన్నారు.
అనంతరం తన SIR పామ్ ను నింపి తమ గ్రామ GPO రాజు గారికి అందజేసినారు. ప్రజలకు SIR ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, న్యాయబద్ధంగా సాగాలని అధికారులను కోరారు.
అలాగే ఈనెల అనగా జులై 24 వ తేదీ వరకు మన తాండ్ర.జి గ్రామం వారు మరియు తెలంగాణ రాష్ట్రములో ఉన్న BLO లు ఇచ్చిన పారమ్స్ నింపి అందజేయాలనీ సాక్ పెళ్ళి సురేందర్ చెప్పడం జరిగింది.












