బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నెలకు రూ.3,000 గౌరవ వేతనం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వార్డు సభ్యులు కోరారు. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నెలకు రూ.3,000 గౌరవ వేతనం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వార్డు సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామస్థాయిలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండి, తమ వార్డుల్లో నెలకొనే సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసేది వార్డు సభ్యులేనని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
సర్పంచ్లకు గౌరవ వేతనం అందిస్తున్న తరహాలోనే వార్డు సభ్యులకు కూడా నెలకు రూ.3,000 గౌరవ వేతనం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రజాసేవను పరిగణనలోకి తీసుకొని ఈ అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ వార్డు సభ్యులు కట్ట భూమేష్, కదం వినయ్ కుమార్, షేక్ షాకీర్, కరిపె శ్రీను, మేడిచలం రూప, రాయలు తిరుపతి, సాయికుమార్, భారే ఐశ్వర్య, మాహుర్కర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.












