నిర్మల్, 2026-07-22
నట పకష పేప లక వయవహాంలో విదయాథులకు మదదతుగా నిలుసతునన కాంగెస నాయకులు ాహుల గాంధ అెసటను నిసిసతూ నిమలలో కాంగెస పాట భా ధనా, యాల నివహించింది. ఈ నిసన కాయకమానికి నిమల నియోజకవగ కాంగెస పాట ఇనచాజ కూచాడి హి ావు నాయకతవం వహించాు.
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులకు అండగా నిలుస్తూ పోరాటం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ, నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు నాయకత్వం వహించారు.
ధర్నా అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించి, రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ తక్షణమే విడుదల చేయాలని, నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తదనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా శ్రీ కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












