నిజామాబాద్, జూలై 24
తలంణమంతకే.ట.ము(కేట)మదపుసకంచుకు,చచేూలై24మబదలలయపతంసేకయకమలుఘంహంచలబఎసపటమబదలలఅధయకషులుపటేణులకుపలుపుచచు.కేటతలంణఅభృదధకఎలేసేలందంచయకొయు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.టి. రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని, వచ్చే జూలై 24న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి, యువతకు, ఐటీ రంగానికి, పారిశ్రామిక వృద్ధికి కేటీఆర్ ఎనలేని సేవలందించిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేటీఆర్ జన్మదినాన్ని ఆర్భాటాలకు దూరంగా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం బీఆర్ఎస్ పార్టీ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు.
జిల్లాలోని ప్రతి గ్రామం, మండలం, మున్సిపాలిటీ పరిధిలో రక్తదాన శిబిరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం, పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ, విద్యార్థులకు నోటుబుక్స్ అందజేయడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
సేవా కార్యక్రమాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.












