పెంబి, 25 July
పెంబి పోలీస్ స్టేషన్లో శనివారం పెంబి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు అందింది. కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఈ ఫిర్యాదు చేశారు.
పెంబి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పెంబి పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఐదు వెంకటేష్ మాట్లాడుతూ, నిన్న జన్నారం లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి గురించి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు మరియు వారి అనుచరులు అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలు మాట్లాడారని ఆరోపించారు.
ప్రధానమంత్రి పదవికి అవమానం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెంబి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పుప్పాల రవి, ప్యాక్స్ డైరెక్టర్లు సుంచు శంకర్, నర్రా కృష్ణారెడ్డి, చింతకింది రాజేందర్, మాజీ ఎంపీటీసీ రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.












