Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, ఆగస్టు 3వ తేదీలోపు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు, అవసరమైన సవరణలు, ఆన్లైన్ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యేలా బూత్ లెవల్ సూపర్వైజర్లు (BLS), బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మామడ, లక్ష్మణ్చందా మండలాల్లో నిర్వహించిన బీఎల్ఎస్, బీఎల్ఏల సమన్వయ సమావేశాల్లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
మామడ మండలం, లక్ష్మణ్చందా మండలాల్లో బీఎల్ఎస్, బీఎల్ఏల సమన్వయ సమావేశం నిర్వహించిన కూచాడి శ్రీహరి రావు, ఆగస్టు 3వ తేదీలోపు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు, అవసరమైన సవరణలు, ఆన్లైన్ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యేలా ప్రతి బూత్ లెవల్ సూపర్వైజర్ (BLS), బూత్ లెవల్ ఏజెంట్ (BLA) అప్రమత్తంగా వ్యవహరించి బాధ్యతాయుతంగా పనిచేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు సూచించారు.
నేడు మామడ మండలం, లక్ష్మణ్చందా మండలాల్లో నిర్వహించిన బూత్ లెవల్ సూపర్వైజర్లు (BLS), బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సమన్వయ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ, ప్రతి బూత్‌లో సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రతి బీఎల్ఎస్, బీఎల్ఏ తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి అర్హులైన ఓటరు నమోదు కాకుండా మిగలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశాల్లో మామడ, లక్ష్మణ్చందా మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమరెడ్డి, జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి గాజుల రవికుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొట్టె శేఖర్, మామడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాథోడ్ సంతోష్, లక్ష్మణ్ చందా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రు నరేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఈటల శ్రీనివాస్, పర్పెళ్లి ప్రతాప్ రెడ్డి, కాలగిరి గంగారెడ్డి, లక్ష్మణ్ చందా మాజీ మండల అధ్యక్షులు ఒడ్నాల రాజేశ్వర్, నల్ల లింగ రెడ్డి, మామడ మాజీ సర్పంచ్ బాపయ్య, మాజీ ఎంపీటీసీ సయ్యాద్ అన్వర్, తదితరులు పాల్గొన్నారు.












