Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండలాల్లోని బూత్ స్థాయి పర్యవేక్షకులు, ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని సూచించారు.
దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండలాల్లో బూత్ స్థాయి పర్యవేక్షకులు, ప్రతినిధుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ.. ప్రతి బూత్ స్థాయి పర్యవేక్షకుడు, బూత్ స్థాయి ప్రతినిధి తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ, రెండు మండలాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆగస్టు 3వ తేదీలోపు అర్హులైన ఓటర్లందరి నమోదు, వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి ప్రక్రియలను పూర్తిస్థాయిలో పూర్తి చేసేలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి గాజుల రవికుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొట్టె శేఖర్, దిలావర్పూర్ సర్పంచ్ అనిల్, నర్సాపూర్(జి) సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి, ఉమా మహేశ్వర్, అజీమ్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












