బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 14
బోథ్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారుల వద్ద ఉన్న దరఖాస్తులు, రికార్డులను పరిశీలించి ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
బోథ్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారుల వద్ద ఉన్న దరఖాస్తులు, రికార్డులను పరిశీలించి ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు.
అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తహశీల్దార్, మండల అభివృద్ధి అధికారి, బూత్ స్థాయి అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు సైతం సమాచారం అందించి వారి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ద్వంద్వ ఓట్లను గుర్తించి నిజమైన ఓటర్లకు న్యాయం జరిగేలా జాగ్రత్తగా పరిశీలించాలని బూత్ స్థాయి అధికారులకు సూచించారు. ప్రజలకు సహకారంతో సేవలందిస్తూ దరఖాస్తుల వివరాలను స్పష్టంగా వివరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు తుల శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు స్వామి, మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, సర్పంచులు రవీందర్, బాబులాల్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అల్లాకొండ పోతన్న, ఎలుక రాజు, మల్లెపూల సుభాష్, రమణ గౌడ్, అల్లాకొండ ప్రశాంత్, రఫీ, సంజీవ్, బాపురెడ్డి, వినయ్, ఇఫ్తేకార్, గోపాల్, సందీప్, ఉప సర్పంచ్ మామిడి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.












