మిర్యాలగూడ, జూన్ 28
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన నేపథ్యంలో, మిర్యాలగూడ పట్టణం, మండలాలకు చెందిన వివిధ పార్టీలు, సంఘాల నాయకులను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వారిని వివిధ పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటన సందర్భంగా, మిర్యాలగూడ పట్టణం, మండలాలకు చెందిన వివిధ పార్టీల, సంఘాల నాయకులను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వారిని వివిధ పోలీసు స్టేషన్లలో ఉంచారు.
బీసీ జేఏసీ నాయకులను ఉదయం అదుపులోకి తీసుకొని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు వి.వెంకటేశ్వర్లు, ఎం.రవినాయక్, బీఆర్ఎస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి. ఇలియాస్ ఖాన్, సాది నేని శ్రీనివాస్ రావు, బీఆర్ఎస్వీ నాయకులు ఎండి.షోయేబ్, బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, బీజేపీ నాయకులు రేపాల పురుషోత్తంరెడ్డి, ఎడ్ల రమేష్, బంటు గిరి, మంద శివ, ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పరంగి రాము, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డి. సైదానాయక్, రమణనాయక్ మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే సవాలుగా మారిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు అన్నారు. అక్రమంగా నిర్బంధించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని, ఆక్రమ ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు.
అరెస్టయిన వారిలో బీసీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత, ఎస్సీ మహిళా జిల్లా అధ్యక్షురాలు చిత్రం ఉమ కూడా ఉన్నారు.











