.నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన భవిష్యత్తు అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం : బిఎల్ఆర్
👉 విద్యార్థుల సమాలోచన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
మిర్యాలగూడ, ఆగష్టు 8 (మనోరంజని తెలుగు టైమ్స్)
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల విద్యా విప్లవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని
మిర్యాలగూడ పట్టణం ఎన్ఎస్పి క్యాంపు రాజీవ్ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛాత్రోన్ కీ గూంజ్ -విద్యార్థుల సమాలోచన కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు.
కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) పాల్గొని, విద్యార్థులు, యువత, నిరుద్యోగులతో కలిసి రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ
విద్యార్థుల గొంతుకను వినడం, వారి సమస్యలను పరిష్కరించడం, నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భవిష్యత్తు అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థుల ఆకాంక్షలు, అభిప్రాయాలు, సమస్యలకుప్రాధాన్యతనిస్తూ విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఛాత్రోన్ కీ గూంజ్ -విద్యార్థుల సమాలోచన ద్వారా విద్యార్థులు, యువత తమ భవిష్యత్తు, విద్య, ఉపాధి తదితర అంశాలపై తమ గొంతును వినిపించే అవకాశంకలిగిందన్నారు.దేశ నిర్మాణంలో యువత, విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని, వారికి అన్ని విధాలుగా అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్,
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ధీరావత్ స్కైల్యాబ్ నాయక్, నూకల వేణుగోపాల్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలకృష్ణ, గుడిపాటి నవీన్,నియోజకవర్గం అధ్యక్షుడు షేక్ అజ్హరుద్దీన్, మునిసిపల్ చైర్మన్ చిలుకూరి సుధా, గుడిపాటి శిరీష, కౌన్సిలర్లు దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి, పందిరి అనిత,శ్రీజ,నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












