హైదరాబాద్, 15 July
కాంగ్రెస్ పార్టీ పథకాల ప్రభావం ప్రజల్లో కనిపించడం లేదని, ప్రచారంలో వెనుకబడిపోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ మీనాక్షి నటరాజన్. సోషల్ మీడియాలో పార్టీ బలహీనంగా ఉందని, దీనిపై మరింత దృష్టి సారించాలని ఆమె సూచించారు. బీఆర్ఎస్ పై పోరాడాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పథకాల ప్రభావం ప్రజల్లో లేదని, ప్రచారంలో వెనుకబడ్డామని అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే, కీలక నేతల ముఖాముఖిలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్. సోషల్ మీడియాలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని, దీనిపై గట్టిగా ఫోకస్ చేయాలని ఆమె సూచించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాపై తీవ్రంగా పోరాడాలని ఎంపీ, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానిని తగ్గేలా పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక నాయకుల పరస్పర ఫిర్యాదులపై ప్రత్యేక ఆరా తీశారు. చిన్న విషయాలపై గొడవపడితే మళ్ళీ గెలవలేమంటూ వివాదాస్పద నేతలకు క్లాస్ పీకారు.
కొండా సురేఖ, కడియం, శివ చరణ్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ రెడ్డిలతో మీనాక్షి భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టులపై మహేష్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలతో ప్రత్యేక చర్చలు జరిపారు. వచ్చే రెండు రోజుల పాటు డీసీసీ చీఫ్‌ల ప్రోగ్రెస్ పై మీనాక్షి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్యూమరేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని మీనాక్షి సూచించారు.











