ఖానాపూర్, జూలై 22
ఖానాపూర్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలను డీసీసీ ఎస్టీ సెల్, ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలను ఖానాపూర్లో డీసీసీ ఎస్టీ సెల్, ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బానోత్ గోవింద్ నాయక్, డీసీసీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసముల్ల అశోక్, ఖానాపూర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంగర్తి రాజన్న, మైస శ్రీనివాస్, ముత్తన్నతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











