** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడటం తగదని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ముధోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ ప్రశ్నపత్రాల లీక్‌తో అమరులైన విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తుల నిరసన చేపట్టారు. విద్యార్థుల ఐక్యతకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడటం తగదని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ముధోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాసర-భైంసా రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, నీట్ ప్రశ్నపత్రాల లీక్‌తో అమరులైన విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తుల నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల ఐక్యతకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఇది విద్యార్థుల విజయమని స్పష్టం చేశారు. గత ఎన్నో రోజులుగా దీక్ష చేస్తున్న విద్యార్థులపై బీజేపీ ఆదేశాలతో పోలీసులు విచక్షణా రహితంగా వ్యవహరించారని, వారికి న్యాయం చేయాల్సిన వారు స్పందించకుండా మొండి వైఖరితో వ్యవహరించడంతోనే కేంద్రం దిగిరావాల్సి వచ్చిందని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను, ప్రజాప్రతినిధులను నిర్బంధించడం సరికాదని హితవుపలికారు.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే విద్యార్థుల పక్షాన నిలబడ్డందుకు వారిని సైతం అక్రమంగా అరెస్ట్ చేసి, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడటానికి ప్రయత్నించారని, దీనికి తగిన గుణపాఠం లభించిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లోనైనా ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే చర్యలకు స్వస్తి పలకాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్, మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, నాయకులు సయ్యద్ ఖలీద్, శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ సర్వేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కిష్టయ్య, మాజీ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.












