భీమారం మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ దుర్గం తిరుపతి, తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి సమక్షంలో ఈ చేరిక జరిగింది.
హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో, మంత్రి వివేక్ సర్పంచ్ దుర్గం తిరుపతికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని, మంత్రి వివేక్ ఆహ్వానాన్ని గౌరవించి పార్టీలో చేరినట్లు సర్పంచ్ తెలిపారు.
గ్రామ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి పాటుపడతానని, త్వరలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారని దుర్గం తిరుపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ విధానాలను ప్రశంసించారు.
సర్పంచ్ దుర్గం తిరుపతితో పాటు, నాయకులు భోగే రవీందర్, లింగాల మహేందర్, భోగే మహేందర్ తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపెళ్లి మోహన్ రెడ్డి, మద్దికల్ సర్పంచ్ పోతెం సమ్మయ్య, ఆరేపల్లి సర్పంచ్ ఆకుదారి వీరయ్య, ఎలేకేశ్వరం కాంగ్రెస్ నాయకుడు పర్తిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఎల్కేశ్వరం మాజీ సర్పంచ్ కోడి పే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.








