మంత్రాలయం, 2026-07-24
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు (కేటీఆర్) గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారి ఆదేశానుసారం ఖానాపూర్ మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు (కేటీఆర్) గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారి ఆదేశానుసారం ఖానాపూర్ మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ (జంగల్ హనుమాన్ ఆలయం)లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
ప్రజా పోరాటాలే తన జన్మదిన వేడుకలుగా భావించి, తన పుట్టినరోజును సైతం ప్రజల సంక్షేమానికి అంకితం చేసిన కేటీఆర్ గారు, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నీట్ (NEET) విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












