హైదరాబాద్, జులై 20
‘చలో పార్లమెంట్’ ర్యాలీని విజయవంతం చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పట్టుదలతో ఉంది. ఆ పార్టీకి మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఆదివారం రాత్రంతా నిరసన కొనసాగించి, సోమవారం ఉదయం పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు సోమవారం జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న సుమారు 8 వేల మంది నిరసనకారులు ఆందోళన చేపట్టారు.
‘చలో పార్లమెంట్’ ర్యాలీని విజయవంతం చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పట్టుదలతో ఉంది. ఆ పార్టీకి మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఆదివారం రాత్రంతా నిరసన కొనసాగించి, సోమవారం ఉదయం పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు.
ఈ పిలుపు మేరకు సోమవారం జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న సుమారు 8 వేల మంది నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘చలో పార్లమెంట్’ పిలుపుతో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు వేలాది మంది తరలివచ్చారు.
జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ర్యాలీకి అనుమతి నిరాకరించినప్పటికీ నిరసనకారులు ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల అంచనా ప్రకారం సుమారు 8 వేల మంది నిరసనకారులు గుమిగూడారు. కీలక రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అల్లర్ల నియంత్రణకు ప్రత్యేక వాహనాలను కూడా రంగంలోకి దించారు.
భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ర్యాలీకి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ముందుగానే ప్రకటించారు. పార్లమెంట్ వైపు కదిలేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని ఐదు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌తో పాటు విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నెలన్నరగా జంతర్ మంతర్‌లో ఆందోళన కొనసాగిస్తోంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభ రోజున చేపట్టిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమంతో ఈ నిరసన మరింత ఉద్ధృతమైంది.











