నర్సాపూర్-జి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 01
నియోజకవర్గంలో గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధి పనులు చేపట్టామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ అన్నారు. నర్సాపూర్-జి మండలం గొల్లమాడ గ్రామంలో రూ.25 లక్షల నిధులతో నిర్మించనున్న బీరప్ప ఆలయానికి మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొల్లమాడ గ్రామ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.1.64 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

పెద్దచెరువు మరమ్మతులకు రూ.24 లక్షలు, గోదాం నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి కూడా నిధులు అందించినట్లు పేర్కొన్నారు.
గత పదేళ్లలో అభివృద్ధి పనులు సక్రమంగా జరగకపోవడంతో నియోజకవర్గంలో అనేక రహదారులు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే అన్నారు. హమ్ పథకం కింద రహదారుల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కుంటాల నుంచి గొల్లమాడ వరకు రహదారి నిర్మాణానికి రూ.25 కోట్ల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. త్వరలోనే నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
గ్రామంలోని కళ్యాణ మండపంలో వంటశాల, భోజనశాల నిర్మాణానికి వి.బి.జి. రామ్జీ పథకం కింద నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. శివాలయ నిర్మాణానికి నిధులు కావాలని గ్రామస్థులు కోరగా, ట్రస్టు ఏర్పాటు చేసుకుని సంబంధిత ఫండ్ చెల్లించిన అనంతరం నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యను పరిశీలించేందుకు త్వరలోనే సంబంధిత అధికారులను గ్రామానికి పంపిస్తామని చెప్పారు.
అనంతరం మున్నూరు కాపు సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వారి వద్దకు వెళ్లి, సంఘానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల సీనియర్ నాయకులు, అధికారులు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.