హైదరాబాద్, జూలై 20
కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలను పార్టీ నాయకత్వం తప్పనిసరిగా కాపాడుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి వెంటనే కీలక పదవులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలను పార్టీ నాయకత్వం తప్పనిసరిగా కాపాడుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులకు వెంటనే కీలక పదవులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తే, రేపు పార్టీ అధికారంలో లేకపోతే వారు మళ్లీ తమ పాత పార్టీలకు వెళ్లిపోయే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సేవలను గుర్తించి తగిన అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే వెన్నెముక అని, వారి మనోభావాలను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.












