రాష్ట్రంలో మాదిగ జనాభాకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమ జాతిని మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడల స్వామి మాదిగ ఆరోపించారు.
రాష్ట్ర జనాభాలో సుమారు 10 శాతం ఉన్న మాదిగలకు వర్గీకరణలో కేవలం 1 శాతం మాత్రమే కేటాయించారని ఆయన విమర్శించారు. మాదిగలకు కేవలం ఒక మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన 23 మండల అధ్యక్షుల నియామకాల్లో ఒక్క మాదిగ నాయకుడికి కూడా అవకాశం కల్పించకపోవడం ద్రోహానికి నిదర్శనమని కూడల స్వామి మాదిగ అన్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ మాదిగలను చిన్నచూపు చూసినట్లే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో నడుస్తోందని ఆయన మండిపడ్డారు. ఇది మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మాదిగలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మాదిగ కార్యకర్తలు వెంటనే రాజీనామాలు చేసి జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడల స్వామి మాదిగతో పాటు జిల్లా నాయకులు కారం రవి, అన్నేపాగ అశోక్, సుభాష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.












