నిర్మల్ జిల్లా భైంసా మండలం సుంకలి గ్రామానికి చెందిన దివంగత పొట్టే ఇరన్న మనవడు కొట్టె గజానంద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తాత దివంగత పొట్టే ఇరన్న మాజీ మంత్రి దివంగత గడ్డెన్న (కాకా)కు సన్నిహిత అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీ కోసం విశేషంగా పనిచేశారని గుర్తు చేశారు.
తాను కూడా తాత అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశానని తెలిపారు. గతంలో పార్టీ పదవులు ఇస్తామని పలుమార్లు హామీ ఇచ్చి చివరకు మోసం చేశారని ఆరోపించారు. ఈసారి కూడా ఎలాంటి పదవి ఇవ్వకుండా తనను పక్కన పెట్టడం బాధాకరమని మండిపడ్డారు.
పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే సుమారు 1,500 మంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాంధీ భవన్కు వెళ్లి తమ గోడును పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని గజానంద్ పటేల్ వెల్లడించారు.












