Mahabubnagar/Addakal (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆయన తొలిసారిగా గెలిచిన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ లోనే నేడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రూ.350 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2006, జులై 4న ఆయన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ ZPTCగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొంది రాజకీయాల్లో తొలి అడుగు వేశారు. ఈ ప్రత్యేక సందర్భంగా రేవంత్ రెడ్డి నేడు (బుధవారం) మిడ్జిల్ లో పర్యటించి, రూ.350 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
సాయంత్రం 4 గంటలకు మిడ్జిల్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అంతకుముందు, ఆయన నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండకు చేరుకొని, అక్కడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.










