2026 జులై 24 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించడంతో సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే స్పందించారు. దీక్ష విరమణ ఊరటనిచ్చిందని, సంతోషం వ్యక్తం చేశారు. అయితే, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు సీజేపీ నిరసనలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించడంపై సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే స్పందించారు. దీక్ష విరమణ ఊరటనిచ్చిందని, సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 'మీ ధైర్యం, త్యాగానికి థాంక్యూ సర్. మీ జీవితాన్ని పణంగా పెట్టి దేశాన్ని మేల్కొలిపారు. మీ జీవితం ఈ దేశానికి ఎంతో అమూల్యం' అని ఆయన X (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.
అయితే, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలు కొనసాగుతాయని అభిజీత్ స్పష్టం చేశారు.











