నిర్మల్, 4 September
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఇచ్చోడ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట వంటా వార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట *ఇచ్చోడ విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి.. వంటా వార్పుతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిరసన* *రైతులతో కలిసి ఉరి తాడుతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వినూత్న నిరసన* కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఇచ్చోడ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట వంటా వార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మోటర్లకు మీటర్లు పెడితే రైతులకు మిగిలేది ఉరే అంటూ రైతులతో కలిసి ఉరి తాళ్లతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతులను కరెంట్ కోతలతో ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.












