బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 02
బోథ్ పట్టణంలో జరుగుతున్న SIR ఎన్యూమరేషన్ ప్రక్రియను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
బోథ్ పట్టణ కేంద్రంలో జరుగుతున్న SIR ఎన్యూమరేషన్ ప్రక్రియను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్యూమరేషన్ ప్రక్రియను నిర్వహించాలని కోరారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని, ఎవరూ ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న BLO మరియు BLA 2లకు ప్రజలు సహకరించాలని, అవసరమైన పత్రాలను అందించి ఎన్యూమరేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, బోథ్ మండల అధ్యక్షుడు మెరుగు భోజన్న, రాష్ట్ర టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగా రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మాజీ బోథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సింహ దాస్, మాజీ ఎంపీటీసీ చాట్ల ఉమేష్, బోథ్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ రాజు రెడ్డి, మాజీ డైరెక్టర్ అబ్రార్, ఆత్మ డైరెక్టర్లు అబుద్, రహీమొద్దీన్, కుచ్లపూర్ ఉప సర్పంచ్ అరుణ్ రెడ్డి, సీనియర్ నాయకులు మొహమ్మద్, హసీబ్, ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ అనుపట్ల సంజీవ్, అచ్యుతానంద రెడ్డి, బీరం రవి, గడ్డల నారాయణ, భీమా భూచన్న, బోథ్ నియోజకవర్గ మాజీ అధికార ప్రతినిధి యండి సద్దాం, జగన్, షేక్ షకీర్, మారుతి తదితరులు పాల్గొన్నారు.











