కుంటాల, జులై 2
భారతీయ జనతా పార్టీ కుంటాల మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఓలా, లింబా–బి, లింబా–కే గ్రామాల్లో ఓటరు నమోదు ప్రత్యేక సవరణ కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు. అర్హులైన ఓటర్లు గడువులోపు దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు.
భారతీయ జనతా పార్టీ కుంటాల మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఓలా, లింబా–బి, లింబా–కే గ్రామాల్లో ఓటరు నమోదు ప్రత్యేక సవరణ కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటర్లకు ప్రత్యేక సవరణ ప్రక్రియ గురించి వివరించి, అర్హులైన ప్రతి ఓటరు నిర్ణీత గడువులోపు సంబంధిత దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. అవసరమైన వారికి అక్కడికక్కడే దరఖాస్తులు నింపించి సహాయం చేశారు.
ఈ కార్యక్రమంలో కేశెట్టి అశోక్ కుమార్, సాయి సూర్యవంశీ, ఓలా గ్రామ సర్పంచ్ రవి, భారతీయ జనతా పార్టీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సాదు ప్రభాకర్, పసుల నవీన్, దత్తు పటేల్, బూత్ స్థాయి ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.











