బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త బాధ్యులను నియమించింది. బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులుగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యులను నియమించింది. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ మేరకు బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుడిగా మాజీ శాసనసభ్యుడు, భారత రాష్ట్ర సమితి మాజీ రాష్ట్ర పరిశీలకుడు రాథోడ్ బాపూరావును నియమించారు.
ఈ నిర్ణయాన్ని బోథ్ నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. రాథోడ్ బాపూరావు నాయకత్వంలో బోథ్ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రాథోడ్ బాపూరావు పేర్కొన్నారు.











