M4News (ప్రతినిధి)
నాగర్ కర్నూల్, పిబ్రవరి 07
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో శుక్రవారం పొలిటికల్ సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్‌కు చెందిన నరేష్ ప్రసంగిస్తూ, రాజనీతి శాస్త్రంలోని ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు.
డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ఈ సెమినార్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు రాజకీయ వ్యవస్థలు, ప్రభుత్వ విధానాలు, ప్రజాస్వామ్య మూలసిద్ధాంతాలు వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ తరహా సెమినార్లు విద్యార్థులకు విశ్లేషణాత్మక దృష్టికోణాన్ని పెంచేందుకు దోహదపడతాయని అధ్యాపకులు తెలిపారు.