అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ – 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు

అనంతపురంలో రథం కాల్చిన ఘటన
  • అనంతపురం జిల్లా హనకనహళ్ గ్రామంలో రామాలయం రథానికి నిప్పు పెట్టిన ఘటన
  • ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దర్యాప్తుకు ఆదేశాలు
  • 24 గంటల్లోనే నిందితుల అరెస్ట్

అనంతపురంలో రథం కాల్చిన ఘటన


అనంతపురం జిల్లాలోని హనకనహళ్ గ్రామంలో రామాలయం రథానికి నిప్పు పెట్టిన నిందితుడిని 24 గంటల్లోగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడి వివరాలు వెలుగులోకి రానున్నాయి.

అనంతపురం జిల్లాలోని కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో రామాలయం రథానికి నిప్పు పెట్టిన ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశించారు.

డిస్ట్రిక్ ఎస్పీ జగదీష్ మరియు వారి టీం 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ దర్యాప్తులో, రథానికి నిప్పు పెట్టడంలో గ్రామంలో ఉన్న విభేదాలను గుర్తించారు. 2022లో, శ్రీరాముల వారి రథాన్ని ఎర్రస్వామి రెడ్డి బ్రదర్స్ 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి తయారు చేయించినట్లు తెలిసింది, ఇది గ్రామస్తుల మధ్య విభేదాలకు కారణమైంది.

రాయదుర్గం సీఐ వెంకటరమణ, ఎస్ఐ నాగ మధు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరిగింది. వైసిపి కార్యకర్త బొడిమల్ల ఈశ్వర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈశ్వర రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తే, ఇతర నిందితుల వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment