మైసూర్‌పాక్.. రసగుల్లా!.. ‘టచ్’లో ఉన్న వారి పేర్లు చూసి కంగుతిన్న పోలీసులు
శ్వేతాగౌడ
అందమైన ఆమె సెల్‌ఫోన్.. పోలీసుల విచారణకు అవసరమొచ్చింది. ‘మీ సెల్‌ఫోన్ ఓసారి ఇస్తారా?’ అంటూ తీసుకుని పరిశీలిస్తే.. ఆమెతో ‘టచ్’లో ఉన్న వారి పేర్లు చూసి కంగుతున్నారు. మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌తో తనకున్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని వంచనకు పాల్పడిన శ్వేతా గౌడ విచారణను బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, భారతినగర ఠాణా పోలీసులు కొనసాగిస్తున్న క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు విస్మయం గొలుపుతున్నాయి. ఆమె తన ఫోన్లో వర్తూరు ప్రకాశ్ పేరును మైసూరు పాక్‌గా నమోదు చేసుకుంది. మరో భాజపా నాయకుడి పేరును గులాబ్ జామూన్‌గా, ఇంకో స్థానిక నేత పేరును రసగుల్లాగా పెట్టుకుంది. ఇలానే మరికొందరికి ‘తీపి’ నామధేయాలు తగిలించింది. శ్రీమంతులను లక్ష్యంగా చేసుకుని నగదు సంపాదన కోసం ఆమె గాలం వేసేదని అనుమానిస్తున్నారు.
ఇప్పటికే వంచనలతో కూడగట్టుకున్న సొమ్ముతో కొనుగోలు చేసుకున్న విలాసవంతమైన కారులో తిరుగుతూ, పరపతి, పలుకుబడి ఉండేవారితో స్నేహాన్ని సంపాదించేది.