సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా: సీపీ గౌస్ ఆలం
మనోరంజని తెలుగు టైమ్స్ కరీంనగర్ ప్రతినిధి అక్టోబర్ 19
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సీపీ గౌష్ ఆలం ఆదివారం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణ సాయం కోసం పోలీస్ కంట్రోల్ రూం 100, ఫైర్ కంట్రోల్ రూం 101, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112 నంబర్లను సంప్రదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సేవలు అందించడానికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.