పోలీసులు – ప్రజలు కలిసిమెలిసి శాంతి స్థాపనలో భాగస్వాములు కావాలి : రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ

🗓️ మనోరంజని తెలుగు టైమ్స్ | లింగాపూర్ ప్రతినిధి | అక్టోబర్ 22

లింగాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌.ఐ. గంగన్నను రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ మర్యాదపూర్వకంగా కలిసి, గౌరవ సూచకంగా శాలువా అర్పించి సన్మానించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పోలీసు శాఖ ప్రజలతో కలసి శాంతి భద్రతలను కాపాడే విధంగా వ్యవహరించాలి అని సూచించారు. మండలంలో సుస్థిరమైన శాంతి వాతావరణం నెలకొనాలంటే పోలీసులు, ప్రజలు పరస్పర విశ్వాసంతో కలిసి పనిచేయడం కీలకం అని ఆయన పేర్కొన్నారు.

పోలీసులు ప్రజల సమస్యలను తమవిగా భావించి పరిష్కరించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, సమాజంలో న్యాయస్ఫూర్తి, ఐకమత్యం బలపడతాయని జిలానీ  తెలిపారు.

రెహమాన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ శాంతి, సామాజిక ఐకమత్యం, ప్రజా సేవల కోసం ముందుండి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహకులు మహమ్మద్ జబ్బార్ సాబ్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్, చప్డే మారుతి, షేక్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment