ఆపదలో ఆదుకున్న పోలీస్

ఆపదలో ఆదుకున్న పోలీస్

నిర్మల్, డిసెంబర్ 16 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):

నిర్మల్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిండు గర్భిణీ స్త్రీకి డెలివరీ ఆపరేషన్ కోసం అత్యవసరంగా AB+ రక్తం అవసరమైంది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వైద్యులు వెంటనే రక్తదానం చేయగల వ్యక్తిని సంప్రదించాలని కుటుంబ సభ్యులను కోరారు.వెంటనే సమాచారం అందుకున్న నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఆ విషయాన్ని సారంగాపూర్ ఎస్సై సల్ల శ్రీకాంత్ ను తెలియజేశారు. అదే రక్త గ్రూప్ కలిగిన శ్రీకాంత్ నిర్మల్‌కు చేరుకుని, తక్షణమే రక్తదానం చేశారు.ఆపరేషన్ విజయవంతంగా పూర్తై, మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.రక్తదానం చేసిన ఎస్సై శ్రీకాంత్ ను మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. “పోలీసులు సేవలోనే దేవుడు ఉంటారని మరోసారి నిరూపించారు” అని స్థానికులు ప్రశంసించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment