MLC పదవికి కవిత రాజీనామా
TG: ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక
సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జై తెలంగాణ అంటూ ప్రెస్మీట్లో మాట్లాడడం ఆరంభించిన కవిత.. బీఆర్ఎస్ నేతలపై మరోసారి మండిపడ్డారు. తనను బహిష్కరిస్తూ బీఆర్ఎస్ విడుదల చేసిన ప్రకటనను కవిత మరోసారి చదివి వినిపించారు.