నాగరికత పేరు మీద
అనాగరికం అవుతుందా?
విజ్ఞానం పేరు మీద
విధ్వంసం అవుతుందా?
అక్షరాలు రాని నాడు
అల్ప సంఖ్య జనాభా
అక్షరాలు నేర్చినేడు
పెరుగుతున్న జనాభా.
పురుగు మందు చల్లుకుని
పండించుట నాగరికతా?
మందులేవి చల్లనట్టి
ఆనాటిది నాగరికతా?
కట్టుకొనగ బట్టలేక
చిరిగిన దుస్తులు నాడు
నాగరికత పేరు మీద
చింపిన దుస్తులు నేడు.
నల్ల మట్టి కుంకుడు తో
నల్ల జుట్టు నాడు
సుబ్బులు, షాంపూలు రుద్ది
తెల్ల జుట్టు నేడు.
కాలుష్యం, కల్మషాలు
లేని నాడు నాగరికతా?
కల్మషాలు, కాలుష్యం
ఉన్న నేడు నాగరికతా?
సమాజమా నీ పయనమెటు?
నాగరికమా నీ గమ్యమెటూ?
కడారి దశరథ్
ఉన్నత పాఠశాల సిద్దుల కుంట.
నిర్మల్ జిల్లా.
గ్రామం: వానల్ పహాడ్.
ఫోన్: 9440118271.