నందిగాం లో వైభవంగా పోచమ్మ తల్లీ మూర్తీ ప్రతిష్టాపన

పోచమ్మ తల్లీ మూర్తీ ప్రతిష్టాపన మహోత్సవం నందిగాం
  • నందిగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవం.
  • మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
  • హోమం, పూజా కార్యక్రమాలతో మహాప్రసాద వితరణ.

 

తానూర్ మండలం నందిగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లీ ఆలయంలో విగ్రహం, శీఖర ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. మహిళలు కలశాలతో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులచే హోమం, పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించి భక్తులకు మహాప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

తానూర్ మండలంలోని నందిగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో విగ్రహం మరియు శీఖర ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులచే ఆలయ ప్రతిష్టాపనకు సంబంధించిన హోమం, పూజలు జరిపి, అమ్మవారి శీఖర ప్రతిష్టాపన ఘనంగా పూర్తయింది.

ఈ సందర్భంగా మహిళలు కలశాలతో ఆలయ ప్రాంగణంలోకి తరలివచ్చి మంగళహారతులతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి, భక్తులకు మహాప్రసాదం అందజేశారు. ఈ వేడుకలో మాజీ సర్పంచ్ మారుతి, నర్సింలు, బి.మారుతి, ఎం.లక్ష్మణ్, సురేష్, పీరాజీ, భోజరాం తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment