మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి: మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

: మైదంబండ గ్రామస్తులు మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

పెద్దపల్లి జిల్లా, అక్టోబర్ 22, 2024:

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామ ప్రజలు, ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందించాలని కోరుతూ మంగళవారం ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రం అందజేశారు.

గ్రామ ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లడంలో, విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు చేరడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన సమస్యను త్వరగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.

వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, గోదావరిఖని డిపో మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు, బస్సు సౌకర్యాన్ని త్వరలో అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment